
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల అంచనా వ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ , వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వర్షం పడుతున్న ప్రతి సారీ లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు,వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ, బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువవచ్చి, ముంపు సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఈఈ లు శ్రీనివాస్, శ్రీకాంతిని, డీఈ దుర్గ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా , టీపీఎస్ రవీందర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.