
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలా విస్తరణ పనులను చేపడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ లోని నారాయణ ఎన్క్లేవ్ వద్ద రూ.1 కోటి 55 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను మంగళవారం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులను చేపట్టడంతో ప్రజలకు ముంపు సమస్య తీరనున్నట్లు చెప్పారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో పురోగతి సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ శ్రీకాంతిని,డీఈ స్రవంతి, ఏఈ శివప్రసాద్,వర్క్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్,చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,సత్యనారాయణ ఎన్క్లేవ్ అసోసియేషన్ సభ్యులు లోకేష్,రాధాకృష్ణ ,ఏఎస్ఎన్ మూర్తి, రవీంద్రనాథ్, ఎన్ బికె మూర్తి,చంద్రమౌళి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.