
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నేటి యువత నేతాజీని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు.ఆదివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో చంద్రబోస్ చేసిన త్యాగాలు,సేవలు మరువలేనివని కొనియాడారు.యువత సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్,నాగేశ్వర్ గౌడ్,శ్రీశైలం కురుమ,లక్ష్మణ్,రవీందర్,ప్రభాకర్,గణేష్,వెంకట్, శ్రీను, బాలస్వామి,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.