
450Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మియపూర్ డివిజన్ లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. డివిజన్ పరిధిలోని మాయూరి నగర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న భూగర్భ డ్రైనేజి లైన్ పనులను శుక్రవారం స్థానిక కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలలో ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. డివిజన్ అన్ని రంగాలలో విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట వర్క్ ఇన్స్పెక్టర్స్ విశ్వనాధ్,జగదీష్ ,చంద్రిక ప్రసాద్ గౌడ్, అశోక్ తదితరులు ఉన్నారు.