
980Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిదిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ, మహోదయా ఎనక్లేవ్, అల్లూరి సీతారామరాజు నగర్ కలనిలలో మొదటి విడత కోవిడ్ వాక్సినేషన్ వంద శాతం పూర్తియిన సందర్భంగా కాలనీ అసోషియన్ వారికి సర్టిఫికేట్స్ ను జీహెచ్ఎంసీ గౌరవ డీసీ సూదంష్ గారు, PO వస్సలా దేవి, ఎఇ రామ్మోహన్ తో కలసి అందజేసిన మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియపూర్ డివిజన్ పరిధిలో ఉన్న కాలనీ లు వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.