
తెలంగాణ మిర్రర్, మియపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీ లలో 4 కోట్ల 70 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులకు జిహెచ్ఎంసి అధికారులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి కెటిఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ అభివృద్ధికి కోసం శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా యుజిడి పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఆయన తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు..
1. మయూరి నగర్ కాలనీ లో ఒక కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులు.
2. మక్తా మహబూబ్ పెట్ లో ఒక కోటి ఇరవై లక్షల రూపాయల అంచనతో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులు.
3. మియాపూర్, న్యూ కాలనీ , బాలాజీ నగర్ కాలనీలలో తొంభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులు..
4. Dr. రెడ్డీస్ కాలనీ, BK ఎనక్లేవ్ కాలనీల లో అరవై మూడు లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులు..
5. స్టాలిన్ నగర్ కాలనీలో నలభై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులు..
6. FCI కాలనీలో నలభై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునరుద్ధరణ నిర్మాణ పనులు.. పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్ , మహమ్మద్ కాజా, జంగిర్, సాయి యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, కలిదిండి రోజా, సుప్రజా, వరలక్ష్మి, రాణి, లత, హన్మంతరావు, రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, శివ ముదిరాజ్, ఉమాకిషన్, వెంకటేష్, జంగం మల్లేష్, శ్రీధర్ ముదిరాజ్, అనిల్, దయనంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, రాజు ముదిరాజ్, నర్సింగ్ రావు, సంతోష్, స్వామి నాయక్, కృష్ణ నాయక్, అశోక్, కిషోర్, నారాయణ రావు, తెరాస నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.