Home » మానవసేవయే మాధవసేవ : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

మానవసేవయే మాధవసేవ : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
380Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహ కల్పలో నారి శక్తి వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమాలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అధితిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మానవసేవయే మాధవసేవని తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు మేమున్నాం అన్న భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ సొసైటీ ద్వారా మీరు మరిన్ని కార్యక్రమాలతో ముందుకు సాగాలని సూచించారు. కాలనీలో చాలా బీద కుటుంబాలు ఉన్నాయని వారి అందరి కోసం ఈ సంస్థ ద్వారా వారికి ఆశ్రయం కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నారిశక్తి సంస్థ అధ్యక్షులు రాణి,ఈశ్వర శర్మ,వార్డు మెంబెర్ శ్రీకళ, పాఠశాల చైర్మన్ బసవరాజ్,పవన్,చంద్రకళ,రజినీ,గోపాల్ యాదవ్, భీమ్ రత్న సలీం,శ్రీ ఖాజా సయ్యిద్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment