Home » మానవత్వం చాటుకున్న తెరాస నాయకులు గుర్ల తిరుమలేష్

మానవత్వం చాటుకున్న తెరాస నాయకులు గుర్ల తిరుమలేష్

by Admin
410Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  ప్రతి నిత్యం వేకువజామునే తమ విధి నిర్వహణలో నిమగ్నమై పరిసరాల పరిశుభ్రతకు పాటు పడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కాపాడేందుకు పారిశుద్య కార్మికుల కృషి మరవలేనిదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ అన్నారు. బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకొని గుర్ల తిరుమలేష్ తన స్వంత డబ్బులతో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్‌ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారని అన్నారు. ప్రతి రోజు ఉదయాన్నే కాలనీలు, ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేస్తూ పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములవుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ‌తెరాస సీనియర్ నాయకులు కలివేముల వీరేశం గౌడ్ గణేష్ రెడ్డి మధు కుమార్ వెంకటేష్ శానిటేషన్ సూపర్వైజర్ బాలరాజ్ భిక్షపతి గౌడ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment