
తెలంగాణ మిర్రర్, మాదాపూర్: దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు విస్తృత స్థాయిలో మంచి ఆదరణ లభిస్తుంది. శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న “నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో కి సందర్శకుల నుండి మంచి స్పందన వస్తుంది. దీపావళి పండుగ సందర్బంగా మహిళలు అధిక సంఖ్య లో కొనుగోలు చేస్తున్నారు. చేనేత ప్రదర్శనలో పోచంపల్లి,ఇక్కట్, మంగళగిరి, ఉప్పాడ, వేంకటగిరి, భాగల్పూరి సిల్క్, బెంగాలీ కాటన్ సారీస్, మహారాష్ట్ర పైతాని చీర;లు, బెడ్ షీట్స్ , వరంగల్ దార్రిస్ , కారోయేట్స్ ఎన్నో రకాల చేనేత వస్త్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ఈ నెల 12 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిదంగా సాయంత్రం యంపీ థియేటర్ లో సాంస్కృతిక ప్రదర్శనలలో భాగంగా కానక దుర్గ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఈ నృత్య ప్రదర్శనలో వినాయక కౌతం,బ్రహ్మాంజలి , శివ పంచాక్షరీ , నమస్సివాయ, నారాయణీయం, భామాకలాపం, చిన్న జీయర్ సాంగ్, బాలగోపాలా తారంగం, తక్కువేమి మనకు, జాలరులు కురియగా, ధనశ్రీ తిల్లాన, రామాయణశబ్దం మొదలైన అంశాలను ప్రదర్శించారు. పాల్గొన్న కళాకారులు మోక్షిత, షణ్ముఖ, జ్ఞానస్వి, కృష్ణ ప్రియా, సాత్విక, హన్షిత, శ్రావణి, దీక్షిత, శార్దవల్లి, హరీష్, శ్రీదేవి, నందిత లక్ష్మి కళాకారులు పాల్గొన్నారు.