
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్ శ్రేణులు పాటుపడాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ లో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి విప్ గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బస్తీలు, కాలనీలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు.ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ పటిష్టత కోసం కలిసి కట్టుగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస సీనియర్ నాయకులు సాంబశివరావు , రెహమాన్ భాయ్,బాబ్ భాయ్, భృంధారావు,వార్డ్ మెంబర్ రహీం భాయ్, సుభాష్ చంద్రబోస్ నగర్ తెరాస పార్టీ బస్తి కమిటీ అధ్యక్షులు ముఖ్టర్,మహిళ అధ్యక్షురాలు మొగులమ్మా, యూత్ అధ్యక్షులు చిన్న,డివిజన్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా, డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షులు సంతోష్,సాజిద్ భాయ్,కృష్ణ యాదవ్, బుజ్జన్న,సత్యం,అంకారావు,వి,రఘు,షరీఫ్,సలీం,రామా క్రిష్ణ, నర్సింహా రావు, శ్రీను,యూత్ సాయి యాదవ్,సుధాకర్,అరవింద్,రాజా శేఖర్ స్థానిక నాయకులు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.