Home » మాదాపూర్ డివిజన్ అభివృదే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజన్ అభివృదే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తున్నామని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో పర్యటించి నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైప్ లైన్,స్థానికంగా నెలకొన్న మంజీర నీటి సమస్యను జలమండలి మేనేజర్ ఇల్వర్తి, స్థానిక నాయకులతో కలిసి  కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాలనీ,బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రామచందర్ నాయకులు హుస్సేన్,ప్రసాద్,నాగులు,జనార్దన్,దశరథ్,చందు,హనుమంతు నాయక్,ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment