
*మయూరి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన కార్పొరేటర్ పుష్పనగేష్
తెలంగాణ మిర్రర్,రామచంద్రపురం : అసెంబ్లీసాక్షిగా 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, వయోపరిమితి పెంపు, 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు.బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించిన సందర్బంగా గురువారం డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ పుష్పనగేష్ కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవని కార్పొరేటర్ తెలిపారు.మాటతప్పని మహానేత సీఎం కేసీఆర్ అని సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో ప్రజలకు జనరంజక పాలనను అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కలను ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రాజు గౌడ్ కాలనీ అధ్యక్షులు,శ్రీనివాస్ రెడ్డి,విట్టల్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,దేవేందర్ యాదవ్,వీరశెట్టి,బాలరాజు,వెంకట్రాం రెడ్డి,శ్రీకాంత్,శ్రీధర్,రమేష్,సీఎం మల్లేష్,రాగం యాదయ్య,బేగరి శంకర్,నర్సింహా,సుధాకర్,బంటు నర్సింహా,కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.