Home » మాటతప్పని మహానేత సీఎం కేసీఆర్ : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మాటతప్పని మహానేత సీఎం కేసీఆర్ : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

by Admin
1.4kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  91,142  పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.గురువారం మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ లో సీఎం కేసీఆర్  చిత్రపటానికి మియాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు,పలు కాలనీల అసోషియన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్  క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవని కార్పొరేటర్ తెలిపారు.మాటతప్పని మహానేత సీఎం కేసీఆర్‌. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్‌ స్వరాష్ట్రంలో ప్రజలకు జనరంజక పాలనను అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కలను ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రావు,బి,ఎస్,ఎన్, కిరణ్ యాదవ్,మోహన్ ముదిరాజ్, చంద్రిక ప్రసాద్, రోజా,ప్రతాప్ రెడ్డి,మహేందర్ ముదిరాజ్,గోపారాజు శ్రీనివాస్,మాధవరం గోపాల్,మహమ్మద్ ఖాజా,సుప్రజా, లావణ్య, స్వరూప, రాణి,లత,రాజేష్ గౌడ్,దయానంద్ ,శ్రీధర్, కోటయ్య,వెంకటేష్,శ్రీనివాస్ రావు,ప్రసన్న, నరేష్,స్వామినాయక్, సుధాకర్, తిరుపతి నాయక్, అన్నిరాజు, బాబ్జి, మల్లేష్,రాజుగౌడ్, హనుమంతరావు, రామాంజనేయ రెడ్డి ,రాఘవ రావు,కృష్ణ మూర్తి,చిన్న,మురళి,యు.రాజు, కె.నర్సింహులు గౌడ్,రవిగౌడ్,అశోక్,వెంకట్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment