
570Views
తెలంగాణ మిర్రర్,సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్ బుధవారం రవీందర్ గౌడ్ నివాసానికి వెళ్లి , ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కాట సుధారాణి మాట్లాడుతూ రవీందర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలమ్మ,ఎంపిటిసి గోవర్ధన్ గౌడ్,నాయకులు వెంకటేష్,మహిపాల్రెడ్డి,శంకర్,బాలకృష్ణ,మహేష్,సుధాకర్, నర్సింగ్,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.