Home » మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

by Admin
1.5kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : ప్రముఖ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రోజు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆయన్ను గచ్చిబౌలి లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు పలు సినిమా లో నటించారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

You may also like

Leave a Comment