
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాలు మేరకు, మహిళా బందు- కేసీఆర్ సంబరాలు 3రోజుల కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు ప్రేమ్ నగర్ బి బ్లాకులోని కమ్యూనిటీ హాలు నందు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కలసి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులను శాలువాలతో సన్మానం చేసి, స్వీట్స్ తినిపించటం జరిగింది. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కళ్యాణిలక్ష్మి వంటి పధకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ సందర్బంగా వచ్చిన మహిళలు ధన్యవాదలు తెలియజేశారు.
ఈ సందర్బంగా గౌరవ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా సాధికారాతకు పెద్ద పీఠ వేస్తూ, మహిళల సంక్షేమంతో బాటుగా వారి ఆర్ధిక అభివృద్ధికి చేదోడుగా నిలిచిన పెద్ద మనసున్న మనిషి మన సీఎం కేసీఆర్ అని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. మహిళాలకు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం లో భాగంగా మన కేసీఆర్ అందిస్తున్న గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు ప్రపంచంలోనే ఉత్తమమైన పధకంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు రూపరెడ్డి, డాక్టర్ రమేష్, మంగమ్మ, లావణ్య, శ్యామల, ఎల్లయ్య, అబేద్ అలీ, సత్తిబాబు, సులోచన, రమ, లక్ష్మి, సత్యవతి, కళ్యాణి, నాగలక్ష్మి, సమీనా, ముంతాజ్, బిబి, సలీమా బేగం, కానీష ఫాతిమా, వనజ, రఫియా బేగం, రేష్మ బేగం, షబానా, షరీఫా తదితరులు పాల్గొన్నారు.