
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ,అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 6,7,8 మూడు రోజుల పాటు పెద్దఎత్తున మహిళా దినోత్సవ సంబరాలు జరపాలని, సంబరాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి ,తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలమేరకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నివాసం లో మహిళ బంధు కేసీఆర్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మిక మహిళ సోదరీమణులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి చీరలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె అండగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహిళా బంధుగా భావిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6,7,8 తేదీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి మహిళా ఇందులో భాగస్వామ్యం కావాలని, మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందులో మహిళలంతా భారీ ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వ విప్ గాంధీ పిలుపునిచ్చారు.
కెసిఆర్ కిట్టు ద్వారా ఇప్పటి దాకా సుమారు 11 లక్షల మందికి 1700 కోట్ల లబ్ధి… ఒక్కొక్కరికి 13 వేల లబ్ధి చేకూరుతుంది అన్నారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు 9022 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెళ్లి కానుక అందజేసిందని తెలిపారు. మన ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు, వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నది, మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది అని అన్నారు.
విద్యాశాఖ లోప్రభుత్వ పాఠశాలలను బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నాము. 70 లక్షల హెల్త్ hygienic కిట్లను విద్యార్థులకు అందించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, ధనలక్ష్మి, పబ్బా మల్లేష్, రవీందర్ రెడ్డి,అక్బర్ ఖాన్, యూసఫ్ పాషా, కొండల్ రెడ్డి, హరీష్ రెడ్డి,దాస్, నరేందర్ రెడ్డి, సికెందర్, అమిత్ , వరలక్ష్మి,పార్వతి తదితరులు పాల్గొన్నారు.