Home » మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి : డిపిఎం కొమురయ్య

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి : డిపిఎం కొమురయ్య

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, సంగారెడ్డి: మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని సంగారెడ్డి జిల్లా డిపిఎం కొమురయ్య పేర్కొన్నారు. సోమవారం హత్నూర మండలం లోని కాసాల గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన సావిత్రి మగ్గం వర్క్ సెంటర్ ను స్థానిక సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ బైసాని విజయలక్ష్మి వెంకటేష్ గుప్తా, ఏ పీ ఎం శ్రీదేవిలతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల సంఘాలకు ఇచ్చే రుణాలను పెట్టుబడిగా పెట్టి స్వయం స్వాలంబన సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ కిష్టయ్య, వివోఏ మంజుల, గ్రామ సంఘం అధ్యక్షురాలు హుస్నా బేగం, గ్రూప్ సభ్యులు సావిత్రి, రావులకోరి నాగమణి, బక్క నిహారిక, ఆశా వర్కర్ సద్గుణ, గోపాల్, వేణు గౌడ్, నగేష్ యాదవ్, కుమ్మరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment