
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శ్రీ భవాని రాజరాజేశ్వర స్వామి ఆలయ మహారుద్రాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ,కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ భవానీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగిన1331 లీటర్ల ఆవు పాలతో జరిగిన విశేష మహారుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిశ్వరులు పరమహంస ఆశీర్వాదం తీసుకున్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. భగవంతుడి కృప ప్రజలపై తప్పకుండా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి ,దేవాలయ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి ,రాజిరెడ్డి,సురేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి,సీనియర్ నాయకులు సాయి మున్నూరు,రాజు,శ్రీను,నర్సింగ్ రావు,కృష్ణ, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు కార్యకర్తలు నల్లగండ్ల వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.