
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మహాత్ముడు చూపిన దారిలో అందరు నడవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు.ఆదివారం మహాత్మా గాంధీ 73 వర్థంతి సందర్బంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన బాపూజీ వర్థంతి కార్యక్రమానికి రవికుమార్ యాదవ్ పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీ అని ఆయన త్యాగాల్ని, సేవల్ని గుర్తుచేసుకున్నారు.గాంధీజీ జీవితం నుంచి, ఆయన భావాల నుంచి నేర్చుకోవలిసింది ఎంతో ఉందని అన్నారు.అనంతరం పాపిరెడ్డి కాలనీలో పర్యటించారు.ఈ సందర్బంగా కాలనీలో నెలకొన్న మంచినీటి, విద్యుత్,డ్రైనేజీ, పెన్షన్,రేషన్ కార్డు తదితర సమస్యలను స్థానిక ప్రజలు రవికుమార్ దృష్టికి తెచ్చారు.దీంతో స్పందించిన రవికుమార్ యాదవ్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని త్వరలో సంబంధిత అధికారులతో కలిసి మార్గం చూపుతానని బస్తీవాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కంచర్ల ఎల్లేష్, రమేష్, నరసింహ,అప్పారావు, భరత్, గణేష్ ముదిరాజ,లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీను,రాము,కోటి,నీలకంఠ రెడ్డి, అఖిల్ ,హరీష్,విజయ్ యాదవ్,అరుణ,పుష్పలత, విజయలక్ష్మి,రాజమణి, తదితరులు పాల్గొన్నారు.