
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాలని బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ అన్నారు.గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని మల్కం చెరువు వద్ద పార్కులో మార్నింగ్ వాక్ చేసే వాకర్స్‌ను కోరారు.ప్రజలకు సేవచేయడానికి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.నిరుద్యోగులను మోసం చేసిన బీఅర్ఎస్, కళ్ళబోల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ వారి మాటలు నమ్మొద్దని అన్నారు.అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి గా, యువకుడిగా ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చిన రవన్న లాంటి వ్యక్తులను గెలిపించి అసెంబ్లీ కి పంపిస్తే మనకు మంచి పాలకులు వస్తారని, ముఖ్యంగా యువకులు బాధ్యత తీసుకోవాలన్నారు. మనకు అండగా ఉండే వ్యక్తి, పిలుస్తే పలికే వ్యక్తి రవన్న అని అయన గెలుపునకు ప్రతీ ఒక్కరం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక నేతలు,తదితరులు పాల్గొన్నారు.