Home » మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో

by Admin
1.3kViews

ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యూవలరీ షో లో ఆభరణాలను ప్రదర్శిస్తున్న నటి శిరీష

 

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ లోని ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ని ప్రారంభించారు. ఈ ఆర్టిస్ట్రీ షోకి బుల్లితెర నటి శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని వినియోగదారులు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధులతో కలసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన ఆభరణాలను ఆమె వీక్షించారు. ప్రదర్శనలో అద్వితీయమైన హస్త, కళా నైపుణ్యాలతో, హుందాతనంతో కూడిన బంగారం, వజ్రభారణలు, జాతి రత్నభారణలను ప్రదర్శనలో ఉంచారు. మగువలు, పిల్లల మసులను దోచుకునేల ఆభరణాలు ఈ ప్రదర్శనలో ఉంచబడ్డాయి. వినియోగదారులకు పాత బంగారం పై సున్నా శాతం తగ్గింపు, కచ్చితమైన ధరలతో అందుబాటులో ఉంచబడ్డాయన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి వార్షిక ఆదాయంలో కొంత మేర ఆరోగ్యo, ఉచిత విద్య, నిరుపేదల గృహ నిర్మాణం, మహిళ సాధికారత, పర్యావరణ రక్షణ కు తమ వంతు సహాయ అందిస్తుందని స్టోర్ హెడ్ దీపక్ కుమార్ తెలిపారు.

You may also like

Leave a Comment