
తెలంగాణ మిర్రర్, వికారాబాద్: మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు వద్ద గల్లంతైన కారు కోసం జరుగుతున్న గాలింపు పై అరా తీసిన మంత్రి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంఘటన స్థలం లో ఉన్న వికారాబాద్ డి ఎస్ పి కి ఆదేశం. వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ కి ఆదేశించిన మంత్రి సబితా రెడ్డి. గ్రామాల్లో ఆయా ప్రజా ప్రతినిధులు వాగులు, వంకల వద్ద గస్తీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆమె సూచించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఆదివారం భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లా తో పాటు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటం తో ఎలాంటి సంఘటన లు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పౌసుమి బసు,ఎస్ పి నారాయణ కు మంత్రి ఆదేశించారు. మర్పల్లి వాగులో గల్లంతైన వారి ఆచూకీ కనుకోవటానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించాలని పోలీసులకు ఆదేశించారు. నవాబు పెట్ మండలం ఫుల్ మామిడి లో జరిగిన ఘటన తో పాటు,శంకర్ పల్లి మండలం కొత్తపల్లి వాగు,మర్పల్లి మండలం సిరిపురం వద్ద చోటు చేసుకున్న సంఘటనల పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ లు వాగుల వద్ద గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలలో వాగులు, వంకలు, కాల్వల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని వికారాబాద్ ఎస్ పి ని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల వల్ల చోటు చేసుకున్న సంఘటనల పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం పరిచారు. వికారాబాద్ జిల్లా ఎస్పి,కలెక్టర్ లతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి.