
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మూడోసారి బిఆర్ఎస్ పార్టీ రావడం ఖాయమని గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం ఆత్మీయంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ మాట్లాడుతూ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తానని అన్నారు.నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.9 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని,అందరి ఆశీస్సులతో సహకారంతో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలించి మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీను పటేల్, మూల వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.