Home » మన తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం మన బతుకమ్మ పండుగ – అరెకపూడి గాంధీ

మన తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం మన బతుకమ్మ పండుగ – అరెకపూడి గాంధీ

by Admin
410Views

తెలంగాణ మిర్రర్, కొండాపూర్: మన తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం మన బతుకమ్మ పండుగని, కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి పరిమితం మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచంలోనే ఎంతో విశిష్టత గల పండుగగా మన బతుకమ్మ పండుగ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ప్రతి యేటా బతుకమ్మ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులందరికి టీఆరెస్ ప్రభుత్వం కానుకగా బతుకమ్మ చీరలు పంపిణి చెయ్యటం జరుగుతున్నదని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శనివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కమ్యూనిటీ హాల్లో  బతుకమ్మ పండుగ సందర్బంగా ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆదేశాలతో, ప్రతి యేటా టీఆరెస్ ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, టీఆరెస్ నాయకులు, జీహెచ్ఎంసి అధికారులతో కలసి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్ వెంకన్న, సీఓ పద్మ, శానిటేషన్ సూపర్ వైజర్ జలంధర్ రెడ్డి, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, తెరాస సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, అన్నం శశిధర్ రెడ్డి, చాంద్ పాషా, జంగం గౌడ్, పేరుక రమేష్ పటేల్, బలరాం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నరసింహ సాగర్, కె నిర్మల, గౌరీ, రూప రెడ్డి, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, తిరుపతి యాదవ్, బసవ రాజు, రవి శంకర్ నాయక్, రజనీకాంత్, మహ్మద్ అలీ, షబ్బీర్, ఎల్లయ్య, గిరి గౌడ్, మంగమ్మ, అడ్వకేట్ కృష్ణవేణి, పుణ్యవతి, షేక్ రఫియా బేగం, లక్ష్మి, కుమార్, లక్ష్మి నారాయణ, వంగ తిరుపతి రెడ్డి, గణపతి, డా రమేష్, సాగర్, సాయి కుమార్, రామకృష్ణ, దీపక్, ఖాసీం, మహ్మద్, వివి రావు, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, మంగలి కృష్ణ, జీహెచ్ఎంసి సిబ్బంది ఎస్సార్పీ రాజయ్య, యస్ ఎఫ్ ఏ వేణు, నందు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment