
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ సేవా సమర్పణ అభియాన్ లో భాగంగా మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు మధు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్,మాదాపూర్ డివిజన్ బిజెపి నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్ లు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మొక్కలు నాటారు.ఈ సందర్బంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ భూమి మన ఇల్లు లాంటిదని దానిని శుభ్రంగా, ఆకుపచ్చగ ఉంచడానికి మనం నిరంతరం ప్రయత్నాలు చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఒక మొక్క నైనా పెంచరా మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది. ఏసీ పెట్టుకుంటే నీ గది మాత్రమే చల్లగా ఉంటుంది. అదే నీ ఇంటిముందు మొక్కలు నాటి చూడు నీ ఇల్లు మొత్తం చల్లగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ , శ్రీశైలం కురుమ , శ్రీనివాస్ రెడ్డి, మదనాచారి, యాదయ్య , గోవర్ధన్ రెడ్డి, విజయ్, ఆనంద్, భాస్కర్ యాదవ్, నరేష్ రెడ్డి, శివ యాదవ్, విజయ్, రాజు యాదవ్, హరిప్రియ, రమాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.