Home » మట్టి వినాయకుల ను పూజిధాం.. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..

మట్టి వినాయకుల ను పూజిధాం.. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  వినాయక చవిత ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్  కొండా విజయ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లడుతూ భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని సమాజ హితం కోసం  హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గత 6 సంవత్సారాలుగా పర్యవరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం 3 వేల మట్టి వినాయకులని పంపీణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment