
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజక వర్గ వ్యాప్తంగా మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.సోమవారం డివిజన్ పరిధిలోని మజీద్ బండలో రూ.20.లక్షల అంచనావ్యయంతో ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ ,ఎస్ డి ఫండ్స్ ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు స్థానిక నాయకులు,ప్రజలతో కలిసి విప్ అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని స్మశాన వాటికలను మరో మహా ప్రస్థానంల తీర్చిదిద్దుతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్ ,రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్,KN రాములు, కోడిచెర్ల రాములు, వేణు గోపాల్ రెడ్డి,నటరాజు, రమణయ్య, పవన్,నర్సింహ రెడ్డి, మహేష్, అలీ, మరియు కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.