Home » మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిన మొవ్వ సత్యనారాయణ

మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిన మొవ్వ సత్యనారాయణ

by Admin
11.4kViews
74 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బీజేపీ శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు మొవ్వ సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీతో కలిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ గెలుపుకోసం శాయశక్తుల కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆరేకపూడి గాంధీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like

Leave a Comment