
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంచిరెడ్డి కిషన్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందర్నీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు.సీఎం కేసీఆర్ కలిసిన వారిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,చేవెళ్ల ఎంపీ డా.రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,భేతి సుభాష్ రెడ్డి ,జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి , వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.