

భార్య, బిడ్డలను హత్య చేసి ఉరి వేసుకున్న నాగరాజు
*భార్య భర్తల మధ్య గోడవలతో కుటుంబం బలి
*భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకుని భర్త ఆత్మహత్య
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : భార్య భర్తలు ఇద్దరు గొడవపడి భార్యని, ఇద్దరి పిల్లాలని దారుణంగా హత్య.. తను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు (42), భార్య సుజాత (36), సిద్ధు(10), రమ్యశ్రీ (7) లతో కలసి గత 7 సంవత్సరాలుగా పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నాడు. నాగరాజు వృత్తి రిత్యా కిరాణా షాపుల్లో మసాలాలు, పలు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తుంటాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తూ, డబ్బులు వడ్డీలకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్య భర్తల మధ్య గొడవలు జరుహూతున్నాయి. దీనితో నాగరాజు కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భార్య భర్తల ఇద్దరు మరో సారి గోడవపడ్డారు. నాగరాజు భార్య పిల్లలకి విషం ఇచ్చాడు. అయితే బ్రతికే ఉన్నారన్న అనుమానంతో టైలరింగ్ చేసే కత్తెరతో పొడిచి చంపాడు. అనంతరం నాగరాజు కూడా ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నేమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.