
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ వాసులు ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే గాంధీ నివాసంలో కాలనీ వాసులు వాసులు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీని గెలిపించుకుని, తమ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ తనపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మహిళ పక్షపాతి ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు అండగా నిలుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు మరియు కాలనీ వాసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.