Home » భారత జాతీయోద్యమానికి స్ఫూర్తి ప్రదాత అల్లూరి : ప్రభుత్వ విప్ గాంధీ

భారత జాతీయోద్యమానికి స్ఫూర్తి ప్రదాత అల్లూరి : ప్రభుత్వ విప్ గాంధీ

by Admin
12.9kViews
131 Shares

తెలంగాణ మిర్రర్,హఫీజ్ పెట్ : భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని విప్ అరెకపూడి గాంధీ అన్నారు.మంగళవారం అల్లూరి సీతరామరాజు 126వ జయంతి వేడుకలు మియాపూర్ డివిజన్ పరిధిలోని జె.పి.ఎన్ నగర్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి విప్ గాంధీ ఉప్పలపాటి శ్రీకాంత్,జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని , మన్యం ప్రజలలో విప్ల బీజాలు నాటి ప్రజలను చైతన్య పరిచి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచిన మహానుభావుడు అల్లూరి అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు.భారత దేశ స్వాతంత్రము కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు,చిన్న వ‌య‌సుల్లోనే మ‌న్యం ప్ర‌జ‌ల‌ను క‌లుపుకుని బ్రిటీషు పాల‌న‌ను ఎదిరించిన గొప్ప యోధుడ‌ని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగాధర్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, చంద్రిక ప్రసాద్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, దుర్గరాజు, పవన్, రంగరాజు,కృష్ణంరాజు, గంగాధర్, దీప్తి కృష్ణంరాజు, కాట్రగడ్డ సత్యనారాయణ, వర్మ, శివ, బలరామకృష్ణ, రవి,సత్యనారాయణ రాజు, సూరి, నాగరాజు క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment