Home » భారత్ – ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ టిక్కెట్ల జాడ లేదు…?

భారత్ – ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ టిక్కెట్ల జాడ లేదు…?

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 25న జరగనున్న మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA ) నిరాశపరిచింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ లో జరగనున్న మ్యాచ్ టిక్కెట్లు ఈ నెల 15వ తేదీన పేటిఎం ఇన్సైడర్ యాప్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ఆ రోజు ఉదయం సోషల్ మీడియాలో ప్రకటించారు. టిక్కెట్ల విక్రయం ప్రారంభమైన 1గంటలో మొత్తం అయిపోయాయని, త్వరలో మరిన్ని టిక్కెట్లు పేటిఎం లో విక్రయిస్తామని ‘comming soon’ అని ఆప్షన్ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై చర్యలు తీసుకోవాలని మ్యాచ్ టిక్కెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయాని అడ్వాకెట్ సలీం రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. హెచ్ సి ఎ క్రీడాభిమానులను మోసం చేస్తూ టికెట్ల విక్రయాలను బ్లాక్ లో విక్రయించ్చిందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సలీం పిర్యాదు చేశారు. అటు టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద అభిమానులు ఆందోళన చేస్తున్నారు.

You may also like

Leave a Comment