
*భారతీయ జనతా పార్టీ గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల కార్పొరేటర్ కార్యాలయం లో గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి. అనంతరం భారత్ మాత చిత్రపటానికి పూలమాలలు వేసిన డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్,మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్తకు తెలియచెప్పే, ప్రజలకు కార్యకర్తల ద్వారా సంక్షేమ పథకాలు చేరేలా ప్రతి ఒక్కరు పని చేయాలి అన్నారు, రాబోయే 15 రోజులకు చెబట్టే కార్యక్రమలు నాయకులకు కార్యకర్తలకు,దిశ నిర్దేశం చేశారు, ఆదేవిదంగా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు అయిన రావచ్చు కాబట్టి ప్రతి కార్యకర్త సైనికులు గా పార్టీ కోసం పనిచేసి ఈసారి శేరిలింగంపల్లి అసెంబ్లీ కైవసం చేసుకోవాలి అని దిశ నిర్దేసించారు. భారత ప్రధాని మన ప్రియతమ నేత గౌరవనీయులు భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ ఈనెల 12వ తేదీన హైదరాబాద్ కు విచ్చేసే సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ నుండి అధిక సంఖ్యలో ఈ యొక్క బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్,రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్ , గచ్చిబౌలి డివిజన్ ఎస్ సీ మోర్చా అధ్యక్షులు, సంజీవ,గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్ , గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, ఆర్ వెంకటేష్, తిరుపతి, దయాకర్, ఇందిరా, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్,ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, అంబటి అశోక్, అనిల్, వరలక్ష్మి , దినేష్ యాదవ్, శంఖేష్ సింగ్,దేవేరుకోండ గోపాల్,గోపాల్, అరవింద్ సింగ్, విజయ్, గంగాధర్, రాజు, శ్రీను, యాదయ్య, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు