
ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు
నేడు ప్రారంభించనున్న ప్రదాని మోడీ
తొలి దశలో 13 నగరాల్లో సేవలు
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: భారతదేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొన్ని గంటల్లో ఇండియాలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరగబోయే ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 10 రెట్లు వేగంగా 5జీ నెట్వర్క్ ఉ ంటుందని, త్వరలోనే 5జీ ప్రారంభిస్తామని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు 5జీ సేవల్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ నుంచి సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా ఇండియా హెడ్ రవీందర్ టక్కర్ లాంటివారు పాల్గొననున్నట్టు ప్రభుత్వ అధికారుల సమాచారం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ఢిల్లీ, ముంబై సహా ఏడు నగరాల్లో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి 4 వరకు జియో 5జీ ట్రూ సేవల్ని ఇండియా_మొబైల్ కాంగ్రెస్లో ఎక్స్పీరియెన్స్ చేయొచ్చు. ఇందుకోసం రిలయన్స్ జియో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది. జియో 5జీ సేవలు ఎంత వేగంగా ఉంటాయో టెస్ట్ చేయొచ్చు. ఇండియా మొబైలాంగ్రెస్ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనిరేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ఎగ్జిబిషన్ వేదికగా భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టులో నిర్వహించే 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రూ.1.50 లక్షల కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ ఈ వేలంపాటలో పాల్గొన్నాయి.
దేశంలో 4%+% స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతాయని భావించట్లేదని ‘జీ బిజినెస్’తో చెప్పారు టెక్ఆర్క్ విశ్లేషకుడు ఫైసల్ కవూసా. 4%+% ఫోన్లు రిలవెంట్గా ఉంటాయని, స్థిరమైన డిమాండ్ను చూపుతాయని తెలిపారు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యాన్యుఫాక్చరెర్స్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రభావితం చేయగలవని చెప్పారు. సైబర్మీడియా రీసెర్చ్లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు అమిత్ శర్మ ‘జీ బిజినెస్’తో మాట్లాడుతూ.. 4%+ స్మార్ట్ఫోన్ ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5%+% సేవలు అందుబాటులోకి రాగానే పాత స్టాక్లను క్లియర్ చేయడంపై కంపెనీలు దృష్టి పెడతాయన్నారు. పండుగ సీజన్లో 4%+% టెక్నాలజీ ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందించే అవకాశం ఉందని శర్మ పేర్కొన్నారు. కౌంటర్పాయింట్ రీసెర్చ్లోని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. ‘4% స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించడానికి ముందుకు వస్తాయి. 1-2 సంవత్సరాలలో రూ.10 వేలు, అంతకంటే తక్కువ ధరకు లభించే ఫోన్ల స్టాక్లను క్లియర్ చేయడంపై దృష్టి పెడతాయి. ఆ తర్వాత రూ.15 వేల కంటే ఎక్కువ ఉన్న 4% ఇన్వెంటరీని వదిలించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయి. అయితే 200 డాలర్ల కంటే తక్కువ ధరలో ఒక గొప్ప 5%+% ఫోన్ను లాంచ్ చేయడానికి ఇంకా కొంత సమయం వేల కంటే కూడా అవసరం. అందువల్ల ఆ రేంజ్లోని 4%+% ఫోన్లు కొంత కాలం కొనసాగే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమేపీ ఆ ఫోన్ల ధరలను కూడా తగ్గిస్తారు.’ అని వివరించారు.
ప్రధాని మోదీ ఏయే నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్ లో 5%+% నెట్వర్ను ఎలా విడుదల చేయనున్నారో వెల్లడించాయి. రిలయన్స్ జియో _5%+% స్పెక్ట్రమ్ వేలంలో 88,000 కోట్ల రూపాయల విలువైన బిడ్లతో అత్యధిక బిడ్డర్ గా నిలిచింది. ఈ ఏడాది దీపావళి రోజున ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో జియో తన 5జీ నెట్వర్క్ను విడుదల చేయనున్నట్లు ఆగస్టులో కంపెనీ తెలిపింది . రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగిస్తూ, 2023 నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, తహసీల్లో జియో 5%+ నెట్వర్క్్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 5%+ స్పెక్ట్రమ్ వేలంలో రెండవ అత్యధిక బిడ్డర్ అయిన ఎయిర్టెల్, 2023 చివరి నాటికి అన్ని పట్టణ ప్రాంతాలలో తన నెట్వర్క్ 5%+ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు, మార్చి 2024 నాటికి, దేశంలోని అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో 5%+ నెట్వర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలియజేసింది. వేలంలో మూడవ స్థానంలో నిలిచిన వొడాఫోన్ ఐడియా ఏటా ఇంకా తన 5%+% ప్లాన్ను లాంచ్ అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో, వేలం రేసులో నాల్గవ కంపెనీ అదానీ డేటా నెట్వర్క్స్, ఇది అదానీ గ్రూపు చెందినది. కంపెనీ ప్రస్తుతం సాధారణ వినియోగదారుల కోసం 5జీ సేవలను విడుదల చేయదని, కేవలం ఎంటర్ప్రైజైనే దృష్టి సారిస్తుందని స్పష్టం చేసింది.