
410Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి, గల బసవతారక నగర్ లో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం భాగ్యనగర్ ఫౌండేషన్, రాపిడ్ క్లీనిక్ డయాగ్నోస్టిక్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బసవతారక నగర్ నిరాశ్రయులైన బాధితుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించామని అన్నారు.తెరాస ప్రభుత్వం దౌర్జన్యంగా పేదల ఇళ్లు కూల్చివేయడంతో రోడ్డున పడ్డ నిరుపేదలు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటే తెరాస ప్రభుత్వం వేడుక చూస్తున్నారని అన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఫ్రీగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ , జనరల్ చెకప్ లు చేసి ఫ్రీగా టెస్టులు అందజేస్తామని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి కార్పోరేట్ ఆసుపత్రులతో బేరసారాలు కుదుర్చుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే సిగ్గుచేటుగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని బసవతారక నగర్ వాసులు సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించుకోవాలని తెలుపుతూ ఫౌండేషన్ వారికి మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ క్లీనిక్ & డయాగ్నోస్టిక్స్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ , బీజేవైఎం చేవెళ్ల జోనల్ ఇంచార్జీ తోట్ల భరత్ కుమార్ , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి ,సీనియర్ నాయకులు బాల , సీతారాం ,హరీష్ శంకర్ యాదవ్,కిషన్ గౌలి, నర్సింగ్ నాయక్, శ్రీను,రాజు,గుండప్ప రమేష్,రంగయ్య,బాబు, నరేష్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.