
1.1kViews
*ముఖ్యఅతిథిగా పాల్గొని బహుమతులు అందజేసిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : సంక్రాంతి పండుగ సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీ లో 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పుల్లగూర్ల సంతోష లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ,వాలీబాల్, ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాలొగ్ని విజేతలకు బహుమతులు అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, ఇమ్రాన్,నవీన్,హెబ్ నెజెర్,బాలరాజ్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.