Home » బెర్రీ లాంటి అన్యూరిజం ద్వారా చూపు కోల్పోయిన వ్యక్తికి మళ్ళీ చూపును ప్రసాదించిన మెడికవర్ వైద్యులు

బెర్రీ లాంటి అన్యూరిజం ద్వారా చూపు కోల్పోయిన వ్యక్తికి మళ్ళీ చూపును ప్రసాదించిన మెడికవర్ వైద్యులు

by Admin
1.4kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : బెర్రీ లాంటి అన్యూరిజం ద్వారా చూపు కోల్పోయిన వ్యక్తికి మళ్ళీ చూపును ప్రసాదించిన వైద్యులు. మెదడులోని బెర్రీ లాంటి అన్యూరిజం వల్ల కంటి చూపును కోల్పోయిన వ్యక్తికి మెడికవర్ వైద్యులు శాస్త్ర చికిత్స చేసి మళ్ళీ తిరిగి కంటి చూపును తీసుకువచ్చారు. చికిత్స కు సంబంధించిన వివరాలను మెడికవర్ వైద్యులు కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ న్యూరోలజిస్ట్ డాక్టర్ రంజిత్ రెడ్డి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిగికి చెందిన నేమ్యా నాయక్ (50) అనే రైతు గత సంవత్సరం నుండి తీవ్రమైన తల నొప్పి, రెండు కళ్ళ లోని చూపు మందగించడం తో మెడికవర్ ఆసుపత్రి లో చేరాడు. డా రంజిత్, న్యూరో సర్జన్ డా. శ్రీకాంత్ రెడ్డి లు రోగిని పూర్తిగా సమీక్షించి రోగికి ఎమ్మారై పరీక్ష చేసి ఎకోమ్ అన్యురిజం ఉన్నట్లు నిర్ధారణ చేశారు. దీని ద్వారా రోగి చూపును ప్రభావితం చేసే నరాన్ని నొక్కిపడుతుందని, అన్యురిజం పెరిగితే చూపు మొత్తము కోల్పోయె అవకాశం ఉందని, అన్యురిజం పగిలిపోతే సబ్ అరక్నోయిడ్ రక్తస్రావం కలిగి చనిపోవడం జరుగుతుందన్నారు. దానితో పాటు అతని వయస్సు, హృదయ సంబంధిత వ్యాధిని దృష్టిలో ఉంచుకొని అత్యాధునికమైన పరికరాల చికిత్స కన్నా ఎండోవాస్క్యులర్ ఇంటర్వెన్షన్ (కౌంటర్ పరికరం) వేసి తొలగించారు.

మెదడులోని బెర్రీ లాంటి అన్యురిజం

 

ఈ కౌంటర్ పరికరం అనేది అన్యురిజం లోపల ఉంచబడి రక్త ప్రవాహాన్ని ఆపడానికి ఉపయోగించారు. తెలంగాణ లొనే మొట్టమొదటి సరిగా అన్యురిజంకు కౌంటర్ పరికరం వేసి విజయవంతగా తొలగిచరని తెలిపారు. రోగి తలనొప్పి, కంటి చూపు సమస్యల నుండి ఉపశమనం పొందుతున్నాడని, క్రమంగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని డాక్టర్ తెలిపారు.

 

You may also like

Leave a Comment