Home » బీసీలు రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్

బీసీలు రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్

by Admin
8.6kViews
83 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  బీసీలు రాజకీయ రంగంలో నిలదొక్కుకొనిరాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం చందానగర్ లోని  శ్రీ సుప్రజ హోటల్ లో జన జాగరణ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీసీ సంఘం సమావేశం బీసీ జన జాగరణ ఐక్య వేదిక చైర్మన్ బేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా  రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలు దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం దారుణమన్నారు. ‘ఓట్లు,మనవి సీట్లు మన’కు నినాదంతో ముందుకు సాగితేనే న్యాయం జరుగుతుందన్నారు.75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో బీసీలు అన్ని రంగాల్లో అణిచివేయబడ్డారన్నారు. బీసీల ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అన్నారు. అన్ని సమస్యలు రాజ్యాధికారంతో మాత్రమే పరిష్కారం అవుతాయని తెలియజేశారు. శేరిలింగంపల్లి గడ్డ..*బీసీ ల అడ్డా అని నిరూపించుకుంద్దామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ స్థానం లో 2 ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇచ్చే విధంగా పట్టుదలతో ఉందన్నారు.భవిష్యత్తు లో బీసీలందరు ఐక్యతతో ముందుకు వెళ్ళన్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, బీసీ పెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ జన జాగరణ ఐక్య వేదిక చైర్మన్ బేరి రాంచందర్ యాదవ్, శేరిలింగంపల్లి బీసీ సంఘం అధ్యక్షులు రమేష్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ..బీసీల ఐక్యత చాటే సమయం ఆసన్నమైంది.. శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలన్నారు.బీసీలు ఐక్యత చాటే సమయం ఆసన్నమైందని , వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు శాతం ఉన్న రెడ్డిలు 40 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు,1 శాతం ఉన్న వెలమలు 10 అసెంబ్లీ స్థానల్లో ఉన్నారు,  మరి 60 శాతం ఉన్న బీసీలు కేవలం 22స్థానాలో ఉండడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. రాష్ట్రంలో  బిఆర్ఎస్, కాంగ్రెస్,  బిజెపి తదితర పార్టీలు కచ్చితంగా 60అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో బీసీల సత్తా ఏంటో చూపెడతామని హేచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను కచ్చితంగా బీసీ జనాభా ప్రాతిపదికన రెండు అసెంబ్లీ స్థానాలను కచ్చితంగా బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు గౌడ్, భరత్ యాదవ్,  కిరణ్, పవన్,రాజేష్, పవన్, చరణ్ రెడ్డి, బీసీ యువజన సంఘం అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్, యువజన నాయకులు అందెల కుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, గణేష్ యాదవ్, నర్సింహా ముదిరాజ్, మహిళా నాయకురాలు సరోజనమ్మ, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment