
320Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరిని అవలంభిస్తున్నదని, ఆ పార్టీ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు,తెరాస నాయకులకు,కార్యకర్తలకు,వార్డ్ మెంబర్లకు ,ఏరియా కమిటీ మెంబర్లకు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల కమిటీ మెంబర్లకు, ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 20న సోమవారం ఉదయం 11 గంటలకు తమ తమ డివిజన్ల లోని ప్రధాన కూడలి లో తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, నల్ల షర్ట్ లు ధరించి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసి నల్ల జెండా ఎగురవేసి,చావు డబ్బులతో నిరసన నిరసనలు తెలపాలని ప్రభుత్వ విప్ గాంధీ పిలుపునిచ్చారు