Home » బీజేపీ పార్టీ బలోపేతానికి, గెలుపుకు కృషి చేయాలి

బీజేపీ పార్టీ బలోపేతానికి, గెలుపుకు కృషి చేయాలి

by Admin
8.8kViews
61 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కార్యకర్తలందరు పార్టీ ఆదేశాలకు కట్టుబడి, నిరంతరం ప్రజలలో ఉంటూ బీజేపీ పార్టీ బలోపేతానికి, గెలుపుకు కృషి చేయాలనీ బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోజీ నాగరావ్మకర్ణాటక రాష్ట్ర శాసనసభ్యులు మునిరత్నం నాయుడు శేరిలింగంపల్లి బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మియాపూర్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోజీ నాగరావ్, కర్ణాటక రాష్ట్ర శాసనసభ్యులు మునిరత్నం నాయుడు హాజరు అయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, ఎన్నికల నేపథ్యంలో అహర్నిశలు పార్టీ గెలుపుకై కృషి చేయాలని,శేరిలింగంపల్లి లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు.అనంతరం ఈ సందర్బంగా శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ,యోగానంద్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దృడమైన సంకల్పం నిబద్ధత తో ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతూ,పిలుపు నిచ్చారు.సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా నిబద్దతో పనిచేయాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బీజేపీ జెండా రెపరెపలాడే దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని, బిజెపి భారీ మెజారిటీ తో గెలుస్తుందని యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు.ఈ అసంబ్లీ స్థాయి సమావేశం లో బూత్ అధ్యక్షులు,శక్తి కేంద్రాల ఇన్చార్జులు ఆ పై స్థాయి నాయకులు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ నాయకులు, డివిజన్ మోర్చా అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment