
11.4kViews
83
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని శేరిలింగంపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్ అన్నారు. శనివారం మియాపూర్ డివిజన్ 100 ఫీట్ రోడ్,మయూరి నగర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకర్స్ ను కలుస్తూ కరపత్రాలను పంచుతూ, కన్వీనర్ రాఘవేంద్ర రావు, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ హయాంలోనే చేసిన అభివృద్దే తప్ప మరేం జరగలేదన్నారు. కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.