Home » బీజేపీకె శేరిలింగంపల్లి ప్రజల మద్దతు : రవికుమార్ యాదవ్

బీజేపీకె శేరిలింగంపల్లి ప్రజల మద్దతు : రవికుమార్ యాదవ్

by Admin
10.3kViews
131 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపగడపకు రవన్న బిజెపి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గోపి నగర్, బాపూనగర్, ఆదర్శనగర్ లో ఆయన పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కొంతమంది నాయకులు ధన బలాన్ని, కుల బలాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని పేదలకు నిస్వార్థంతో సేవ చేయాలనే సదుద్దేశంతో మేము ముందుకు వస్తున్నామని అన్నారు. మీరంతా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రవికుమార్ యాదవ్ ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో నవతారెడ్డి, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, గుణశేఖర్, చంద్రమౌళి, శంకర్, ఝాన్సీ, రమేష్ ,నరసింహ, గణేష్, చంద్ర శేఖర్ యాదవ్, నరసయ్య పాల్గొన్నారు.

You may also like

Leave a Comment