Home » బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్,బిజెపి నాయకులు

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్,బిజెపి నాయకులు

by Admin
12.4kViews
147 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు.బుధవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారాంలోని చెందిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీలకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి గాంధీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ పార్టీ అలవి కానీ హామీలనిస్తూ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతుబంధు వద్దంటున్న ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అక్తర్, ఉరిటీ వెంకట్ రావు, మోహన్ ముదిరాజు, ప్రవీణ్, దాత్రి గౌడ్,రామరాజు , భగవత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment