Home » బాల బాలికలు తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి… చైల్డ్ ఫండ్ ఇండియా

బాల బాలికలు తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి… చైల్డ్ ఫండ్ ఇండియా

by Admin
9.1kViews
89 Shares

తెలంగాణ మిర్రర్,(శేరిలింగంపల్లి) హైదరాబాద్ :  బాల బాలికలు తమకున్న హక్కుల గురించి వాటిని సంరక్షించుకోవడానికి ఉన్న మార్గాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆ విధంగా ఉంటేనే సమాజంలో పూర్తి సంరక్షణ బాధ్యత ఉంటుందని ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ఫండ్ ఇండియా (చందానగర్) కోఆర్డినేటర్ గ్రేస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కళాశాల లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమే విద్యార్థిని, విద్యార్థులను సూచించి మాట్లాడారు. బాలికలు అత్యవసర పరిస్థితుల్లో 1098 కాల్ చేయాలని ఆమె సూచించారు. వ్యవస్థలో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని, మంచి చెడులపై పూర్తి అవగాహన కలిగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని చైల్డ్ ఫండ్ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫెసిలిటేటర్ దీప సహాయంతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ కళాశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు. నేటి సమాజంలో తమ హక్కుల ఉల్లంఘన జరగకుండా సంబంధిత సంస్థల ద్వారా వాటిని సాధించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన చైల్డ్ ఫండ్ ఇండియా నిర్వాహకులు గ్రేస్, దీప గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులు మల్లికార్జున్, శ్రీకృష్ణ, తో పాటు పాఠశాల కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment