
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : దేశ స్వాతంత్య్రం కోసం,సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీ అన్నారు.భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ గాంధీ మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీలో తెరాస సీనియర్ నాయకులు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి విప్ గాంధీ నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్దికంగా దళితులను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు పార్లమెంట్‌లో ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు.దేశంలో కుల ,వర్ణ వివక్షలు కొనసాగుతున్న తరుణంలో అణచివేతలను తట్టుకుని పూలే ఆశయ సాధనకు నడుం బిగించి ఉప ప్రధాని వరకు ఎదిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పూలే,జగ్జీవన్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్న గొప్పతనం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుంతుందన్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వాలు దళిత సమాజం కోసం ఎన్ని పధకాలు తీసుకువచ్చినా వారి ఆర్థిక ఉన్నతికి అవి చాలవని గుర్తించి దళిత బంధు తీసుకువచ్చిన గొప్పతనం కేసీఆర్ ది అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్,మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,మియాపూర్ డివిజన్ ఆధ్యక్షులు బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, తెరాస నాయకులు నల్లా సంజీవ రెడ్డి,బాలింగ్ యాదగిరి గౌడ్,కృష్ణ ముదిరాజ్,వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, విమల్ కుమార్,సుదర్శన్,బలింగ్ వెంకటేష్ గౌడ్, లక్ష్మణ్ గుప్త,ముఖేష్, చిన్న,సీతారాం, స్వామి నాయక్, శ్రీనివాస్ కాకా,శోభన్,జ్ఞనేశ్వర్,గోపాల్,కేశవ్,శివ,ధనరాజ్,ముజీబ్,పాషా తదితరులు పాల్గొన్నారు.