Home » బాపూజీకి ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

బాపూజీకి ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

by Admin
420Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ 73వ వర్ధంతి సందర్భంగా చందానగర్ లోని గాంధీ విగ్రహానికి డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆదివారం ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీ అని,గాంధీజీ జీవితం నుంచి, ఆయన భావాల నుంచి నేర్చుకోవలిసింది ఎంతో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, ధనలక్ష్మి, రవీందర్ రెడ్డి,మల్లేష్ ,ఓ వెంకటేష్,అమ్జద్ పాషా,వరలక్ష్మి ,పార్వతి ,కొండల్ గొరుగూరురెడ్డి ,కుమార్,యశ్వంత్,బాబు తదితరులు పాల్గొని మహాత్మునికి నివాళులు అర్పించారు.

You may also like

Leave a Comment