
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఇరవై సంవత్సరములు దాటిన సీనియర్ వైద్యులకు సన్మానం. నేడు ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన జేఎస్ ఆర్ ప్రసాద్, ట్రస్ట్ బోర్డ్ మెంబర్, BIACH&RI – సీనియర్ వైద్యులు డా.కల్పన రఘునాథ్ , అసోసియేట్ డైరెక్టర్,అకడమిక్&యాడ్ లైఫ్ – డా.ఏ కె రాజు సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్టు – డా. జంగయ్య సీనియర్ మెడికల్ ఆఫీసర్ – డా. రాజుగోపాల్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టు – డా. కుసుమ కుమారి సీనియర్ మెడికల్ ఆఫీసర్ లను సన్మానించారు. వైద్యుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను సన్మాన గ్రహితలు, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వైద్యులు కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా డా.టి ఎస్ రావు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అని మన సంస్కృతి తెలియజేస్తుందని అంటూ తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు వైద్యం ద్వారా నయం చేయకపోయినా వారికి భరోసా ఇచ్చి తాము సరైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. అదేవిదంగా నానాటికీ పెరుగుతున్న విజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని అంటూ మానవతా విలువలను కాపాడుతూ వైద్యుని విశిష్టతను కాపాడాల్సిన ఆవశ్యకతను మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. అనంతరం జేఎస్అర్ ప్రసాద్ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో వైద్య వృత్తి ఎంతో గొప్పదనే పేరుందని అయితే ఇటీవల కాలంలో ఇటు వంటి ఇతర వృత్తులు కూడా వైద్య వృత్తికి సమానంగా రాణిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా కొత్త ఆవిష్కరణల విషయంలో ఆయా వృత్తులతో సమానంగా పోటీ పడే సందర్భం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే వైద్య వృత్తిలో జరుగుతున్న ఆవిష్కరణలు ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని, అది మానవాళికి మేలు చేసేలా ఉండాలని ఆయన సూచించారు. వైద్యులు తమ పేషెంట్ల పట్ల ఆదరణలో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో జేఎస్ఆర్ ప్రసాద్ ట్రూస్ట్ బోర్డ్ మెంబెర్ BIACH&RI – డా ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI, – డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI – డా. ఫణి కోటేశ్వర రావు మెడికల్ సూపరింటెండెంట్ – డా. కల్పనా రఘునాధ్, మెడికల్ అసోసియేషన్ డైరెక్టర్ – డా.ఏకె రాజు సీనియర్ రేడియేషన్ అంకాలజిస్టు – డా సెంథిల్ రాజప్ప సీనియర్ మెడికాల్ ఆంకాలజిస్టు లతో పాటూ ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.