Home » బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకోవాలన్నదే తమ ధ్యేయం – కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి 

బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకోవాలన్నదే తమ ధ్యేయం – కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి 

by Admin
550Views

తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల రాయదుర్గం లోని వార్డ్ ఆఫీస్ లో బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా అందిస్తున్న చీరలను శనివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, శాసన సభ్యులు  ఆరెకపూడి గాంధీ, ముఖ్య అతిథిలుగా పాల్గొని డిప్యూటీ కమిషనర్ వెంకన్న తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పేద మహిళలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆడుతున్నారని కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. భారత్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో విశిష్టతను సంపాదించుకున్న బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబమని అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు “సారె”గా ప్రతిఏటా బతుకమ్మ చీరలను అందించడం సంప్రదాయంగా వస్తుందని, అక్టోబర్ 6 నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర లోని మహిళల అందరికి బతుకమ్మ పండుగ శుభకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయి బాబా, AMOH రవి కుమార్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, డివిజన్ ఎక్జిక్యూటివ్ మెంబర్ శంలేట్ విజయ్ రాజు, గచ్చిబౌలి డివిజన్ జనరల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, దయాకర్, తిరుపతి, ఎన్టీఆర్ నగర్, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ శివ ,తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు, కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, నరేందర్ ముదిరాజ్, శంలేట్ గోపాల్, సంజీవ్, శంలేట్ విజయ్, రమేష్ యాదవ్, జగయ్య, వరలక్ష్మి, ఇందిరా, నిఖిల్ యాదవ్, అశోక్ యాదవ్, శివ,ప్రవీణ్ వెంకటేష్, దుర్గరామ్, రాము యాదవ్, శివ, శంలేట్ రాజు, సురేందర్, సతీష్ గౌడ్, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, శేఖర్, గోపాల్, మన్నే రమేష్, రంగస్వామి, శ్రీకాంత్, టీంకు, శివ, వెంకటేష్, రాజు, శ్రీను, విష్ణు, క్రాంతి, నర్సింగ్ రావు, గోవర్ధన్ కార్యకర్తలు, కాలనీ వాసులు  స్థానిక సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment